Saturday, August 15, 2026
E-PAPER
Homeజిల్లాలురైటర్ సుంకరి ప్రశాంత్ కు ఉత్తమ ప్రశంసా అవార్డు

రైటర్ సుంకరి ప్రశాంత్ కు ఉత్తమ ప్రశంసా అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర 
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దవంగర పోలీస్ స్టేషన్ రైటర్ సుంకరి ప్రశాంత్ కు ఉత్తమ ప్రశంసా అవార్డు లభించింది. ఈ సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టేషన్‌ రైటర్‌ గా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు ఈ గౌరవం దక్కింది. ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రు నాయక్‌, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులు అభినందించారు. ఆయనతో పాటుగా వడ్డెకొత్తపల్లి ఆయుర్వేదిక్ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి కుమార్, ఉత్తమ పశు వైద్యాధికారి గా డాక్టర్ రాజశేఖర్ లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -