- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రజలకు జిల్లా కలెక్టరేట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజావాణి సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని నిర్వహించిన ప్రజావాణికి నామమాత్ర స్పందనే లభించింది. మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించిన కేవలం మూడు అర్జీలు మాత్రమే వచ్చినట్టుగా నోడల్ అధికారి క్రాంతి కుమార్ తెలిపారు. మరోవైపు ప్రజావాణిలో మొత్తం 27 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా..12 శాఖల అధికారులే రావడం గమనార్హం.
- Advertisement -



