మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌లు కల్పించిన మహనీయుడు బీపీ మండల్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. బిందేశ్వరి ప్రసాద్ జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్ మండల్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాసంస్థలలో ప్రవేశాలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన తన నివేదిక ద్వారా చేసిన నివేదిక ‘మండల్ కమిషన్ నివేదిక’గా చరిత్ర సృష్టించిందని వివరించారు. ఆనాడు ఆయన చేసిన పోరాటాల ఫలితంగానే ఈనాడు బీసీల రిజర్వేషన్‌లు పొందుతున్నారని, ఆయనను ప్రతి బీసీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
బీసీల రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్
- Advertisement -
- Advertisement -



