- Advertisement -
- సుప్రీంలో కోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్: అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ కు సుప్రీంలో కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. బొంబాయి హైకోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుపై చేసిన అప్పీలు విచారణకు వచ్చే వరకు లొంగిపోకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. 2013లో తన మాజీ సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో, 2021లో తీర్పును రద్దు చేస్తూ, బాంబే హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 6న తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
- Advertisement -



