వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించాలంటూ పిలుపు ఇచ్చినందుకు రెండు సార్లు అరెస్ట్ అయిన వైమానిక దళ అధికారిపై సోమవారం అభియోగాలు మోపారు. ‘యూనిఫామ్ కోడ్ ఆఫ్ మిలిటరీ జస్టిస్’ కింద మేజర్ జాసన్ వాట్సన్ ఈ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్టికల్ 88 కింద మూడు ఉల్లంఘనలు, ఆదేశాలను ధిక్కరించారన్న ఆరోపణలపై ఆర్టికల్ 92 కింద ఐదు ఉల్లంఘనలు, అధికారికి తగని ప్రవర్తనకు సంబంధించి ఆర్టికల్ 133 కింద రెండు ఉల్లంఘనలు నమోదయ్యాయి. జూన్ నెలలో మేజర్ జాసన్ వాట్సన్ ‘డిఫెండర్స్ ఆఫ్ అవర్ రిపబ్లిక్ సబ్‌స్టాక్’ అనే న్యూస్ లెటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ, జూలై 1న యూఎస్ క్యాపిటల్ వద్ద యూనిఫారం ధరించి తెలిపిన నిరసన, ఈ నెల 17న సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించి అరుదైన ఆర్టికల్ 88 కింద అభియోగాలు మోపారు. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న నేరాలు అనధికా రికంగానే పరిష్కారం అవుతుంటాయి. కానీ వాట్సన్ విషయంలో అలా జరగలేదు. యూఎస్ క్యాపిటల్ వద్ద నిరసన తెలిపినప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు. సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ట్రంప్‌ను విమర్శించినందుకు గత వారం మరోసారి అరెస్ట్ చేశారు. వాట్సన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకూ ‘విచారణకు ముందు నిర్బంధం’లో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది ఒక రకంగా బెయిల్ నిరాకరించడం వంటిది. దేశాధ్యక్షుడిగా ట్రంప్ విఫలం కావడమే కాకుండా రాజ్యాంగాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారని, చట్టాన్ని అతిక్రమిస్తున్నారని, భారీ అవినీతికి పాల్పడ్డారని, అమెరికన్లను పొట్టనపెట్టు కుంటున్నారని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో వాట్సన్ ఆరోపించారు.
ట్రంప్‌ను విమర్శించిన అధికారిపై అభియోగాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



