- Advertisement -
నవతెలంగాణ – తొగుట
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలంలోని కొల్గూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన బ్రమ్మన బంజేరు పల్లి గ్రామానికి చెందిన పర్సు ఐలయ్య (52) ప్రస్తుతం తొగుట మండలంలోని బండారుపల్లిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై బండారుపల్లికి వస్తుండగా కొల్గుర్ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి అతనిపై నుండి వెళ్ళింది. దీంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఐలయ్య మృతితో వారి కుటుంబంలో తీరని లోటు నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.
- Advertisement -



