- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు కాగా.. మరొకరి గురించి తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -


