గంటలో ట్రూత్ సోషల్ 34 పోస్టులు
బైబై ఖర్గ్ అంటూ ..ఇరాన్ పటంపై
తన ముఖం ఉండేలా ఏఐ ఇమేజ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు ఏమైందనే చర్చ నడుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతమవుతుంది. మరోవైపు ఇరాన్ యుద్ధంలో యూఎస్ చేతులెత్తేసింది. ఇపుడు ట్రంప్ కాస్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పైనే ఆధారపడుతున్నారు. తాజాగా తన ట్రూత్ సోషల్ ఖాతాలో గంట వ్యవధిలోనే 34 పోస్టులు పెట్టారు. ఏఐతో సృష్టించిన చిత్రాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో కూడిన ఈ పోస్టులు సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇందులో ఇరాన్ కీలక చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వరుస పోస్టులు కలకలం రేపుతున్నాయి. ఈ దీవిని చూపిస్తూ ‘బై బై ఖర్గ్’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక, ఇరాన్ పటంపై తన ముఖం ప్రతిబింబించేలా ఏఐ ఫొటో పంచుకున్నారు. ఇక, చంద్రుడు మాకే సొంతం అంటూ మరో పోస్ట్ చేశారు. దీంతో పాటు అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర సూచిక బోర్డును ‘న్యూ అమెరికా’గా మార్చుతున్న ఫొటోను కూడా ట్రంప్ షేర్ చేశారు. అయితే ఈ రాష్ట్రం పేరును మార్చే ఎలాంటి అధికారిక ఉత్తర్వును ఆయన జారీ చేయలేదు. కాగా.. గతంలో పలు ప్రాంతాల పేర్లను ట్రంప్ మార్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులిచ్చారు. అంతకు ముందు కెనడా సరస్సుకు పేరు మార్చి పోస్టులు పెట్టిన విషయం విదితమే.
ట్రంప్ నకు ఏమైంది..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



