Thursday, September 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్‌ భేటీ

శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్‌ భేటీ

- Advertisement -

కొలంబో : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనా యకేతో సమావేశమయ్యారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య నెలకొన్న భాగస్వామ్యంపై చర్చించారు. దక్షిణాసియాలో భద్రత, రక్షణ, శాంతి, అభివృద్ధిని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రాంతీయ భద్రత కోసం సహ కారాన్ని బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయిం చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్‌ మంగళవారం కొలంబో చేరుకున్నారు. బలమైన చారిత్రక, నాగరిక సంబంధాల ఆధారంగా రెండు దేశాల ప్రజల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. భారత రక్షణ మంత్రి శ్రీలంకలో పర్యటించడం 38 సంవత్సరాలలో ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -