- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టిబెట్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూమి అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీని ధాటికి పొరుగున ఉన్న నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. గురువారం రోజున కూడా ఇక్కడ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -


