Wednesday, September 9, 2026
E-PAPER
Homeజాతీయంమనుస్మృతికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

మనుస్మృతికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మనుస్మృతికి వ్యతిరేకంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ బుధవారం నాగ్‌పూర్‌లో ‘సంవిధాన సమ్మాన్ యాత్ర’ (రాజ్యాంగ గౌరవ యాత్ర)ను నిర్వహించింది. రాహుల్ గాంధీపై కేసు నమోదును, ఖర్గే నిర్వహించిన సభ స్థలంలో శుద్ధికరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా యువ కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్‌ఎస్‌ఎస్ స్మృతి మందిరం వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన సందర్భంగా కార్యకర్తలు రాజ్యాంగానికి మద్దతుగా నినాదాలు చేశారు. రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. మార్చ్‌లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంగణం వెలుపల గుమిగూడిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. భారీగా తరలివచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనుస్మృతికి వ్యతిరేకంగా, అలాగే హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేసేందుకే ప్రత్యేకంగా ‘సంవిధాన్ సమ్మాన్ యాత్ర’ను నిర్వహించినట్లు మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -