Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలు15 ఏళ్ళ నా కల నెరవేరింది : నిర్మాత ఉదయభాను

15 ఏళ్ళ నా కల నెరవేరింది : నిర్మాత ఉదయభాను

- Advertisement -

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.
నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈనెల 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉంటాయి. హైదరాబాద్‌లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను మాట్లాడుతూ,‘నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నాను. టెలివిజన్‌లోనే పుట్టాను, ఉదయభాను కాస్తా హృదయ భానుగా మారింది అక్కడే.. అందుకే టెలివిజన్ నుంచే నా ప్రొడక్షన్ మొదలుపెట్టాలని ఇన్నేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేశానో, ఎంత మంచి కంటెంట్ మోసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్లానో నాకే తెలుసు. వచ్చే వారం, వచ్చే నెల మొదలవుతుంది అనుకుంటూనే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరికి నా చిన్ననాటి స్నేహితుడు శ్రీరామ్ ద్వారా ‘జీ’ హెడ్ అనురాధ మేడమ్‌ను కలిశాను. నా దగ్గరున్న కథలు, కాన్సెప్ట్స్ అన్నీ చెబితే ఆమెకు బాగా నచ్చాయి. ఆ తర్వాత వారి ఆలోచనలకు తగినట్లుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. నా బిడ్డల కోసం నేను ఎలాగైతే తాపత్రయపడతానో.. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే తాపత్రయపడ్డాను’ అని తెలిపారు. ‘మా టీమ్‌లో గ్రౌండ్ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని నిర్మాత విజయేంద్ర మౌళి చెప్పారు. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ,‘ఈ బ్యానర్ ఎంతో ఎత్తుకు ఎదగాలని, నాలాంటి ఎంతోమంది దర్శకులకు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈనెల 11న జీ5 ఓటీటీలో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఈ సిరీస్‌ మిమ్మల్పి తప్పకుండా సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -