Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిజయ్‌ దేవరకొండ నట విశ్వరూపం

విజయ్‌ దేవరకొండ నట విశ్వరూపం

- Advertisement -

విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘రణబాలి’ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాక్షస రాజుగా పేరున్న సర్ థియోడర్ హెక్టార్ ఆజ్ఞపై పండిన ప్రతి ధాన్యపు గింజను దోపిడీ చేస్తూ అన్నపూర్ణగా వెలిగిన మన నేలను కరువు సీమగా మార్చేస్తుంటారు బ్రిటీష్ అధికారులు. ఆకలి అని అడిగిన వారిని క్రూరంగా చంపేస్తుంటారు. ఈ రాక్షస రాజు సర్ థియో డర్ హెక్టర్ కు, అతని అధికారులను తన ధైర్య సాహసాలతో అంతే క్రూరంగా ఎదుర్కొంటాడు రణబాలి. గుండె ధైర్యం నిండిన అతని దాటికి, పదునెక్కిన అతని కత్తి వేటుకి బ్రిటీష్ అధికారులు, పోలీసులు చెల్లాచెదురు అవుతారు. ఒక్క ధాన్యపు గింజ పొలిమేర దాటకుండా కాపలా కాస్తూ తన ప్రజల ఆకలి తీర్చుతాడు రణబాలి. ఈ చిత్రంతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నట్లు ఈ టీజర్ తో తెలుస్తోంది. టి సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ క్వాలిటీస్ టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -