సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు.రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సంద ర్భంగా నిర్మాత మధు కలిపు మీడియాతో ముచ్చటించారు. ‘రంగమార్తాండ’ తర్వాత మరొక మంచి సినిమా చేయాలను కుంటున్న సమయంలో దర్శకుడు సంతోష్ ఈ వారాహి అమ్మవారి స్క్రిప్ట్ చెప్పారు. కథ బాగా నచ్చడం తో ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇది అద్భుతమైన కథ. పైగా మా బ్యానర్ పేరు ‘రాజశ్యామల ఎంటర్‌టైన్ మెంట్స్’ కావడం, అది కూడా అమ్మవారి పేరే కావడంతో చాలా ఆనందం గా ఉంది. ఇది చాలా మంచి సినిమా. సుమంత్ , సిద్ధు జొన్నలగడ్డ , ఐశ్వర్య రాజేష్ ఇలా అద్భుతమైన నటీనటులు నటించిన పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ ఇది. సుమంత్ నటన అద్భుతంగా ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ అమ్మవారి రూపంలో చాలా అద్భుతంగా కనిపిస్తారు. సిద్దు పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ కథ వారాహి అమ్మవారి చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మేము ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో సినిమాని గ్రాండ్ గా తీశాం. నిర్మాత లక్ష్మణ్ ‘రంగమార్తాండ’ నుంచి నాకు తోడున్నారు. ఈ కథ నచ్చి ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. డివోషనల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న సినిమా ఇది. దాదాపు గంట పాటు విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయించిన ఈ వర్క్ అంతా చాలా నేచురల్‌గా వచ్చింది. అలాగే సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ అసెట్‌గా నిలుస్తాయి. పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్ర వల్ల ఈ పేరుకు మంచి ప్రచారం వచ్చింది. ఆ తర్వాత వారాహి అమ్మ వారి గుప్త నవరాత్రులు జరగడం, కాకినాడలో ఆలయ నిర్మాణం జరగ డం చూశాం. పవన్ భక్తిశ్రద్ధ లతో అమ్మవారిని కొలిచి అద్భుత మైన ఫలితాలు పొందారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా భక్తి భావంతో అమ్మవారికి నమస్కరించి ధియేటర్ నుంచి బయటకు వస్తారు.
ప్రేక్షకులు భక్తిభావంతో థియేటర్ నుంచి బయటికొస్తారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



