ఆసీస్-ఏతో రెడ్‌బాల్, వైట్‌బాల్ సిరీస్‌లు
ముంబయి : సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత గాయంతో ఆటకు దూరమైన పాండ్య.. అక్టోబర్‌లో ఆస్ర్టేలియా-ఏతో జరిగే 50 ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్య మ్యాచ్ ఫిట్‌నెస్‌ను ఈ సిరీస్‌తో పరీక్షించుకోనున్నాడు. భారత్-ఏ, ఆస్ర్టేలియా-ఏ ద్వైపాక్షిక సిరీస్ ఈ నెల 22న మల్టీ డే ఫార్మాట్‌తో ఆరంభం కానుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 29 నుంచి జరుగుతుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అక్టోబర్ 6, 9, 11న మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ పుదుచ్చెరిలో షెడ్యూల్ చేశారు. భారత సీనియర్ జట్టు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3న వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మల్టీ డే ఫార్మాట్‌లో దేవదత్ పడిక్కల్ కెప్టెన్సీ వహించనుండగా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథిగా వ్యవహరించనున్నాడు.
భారత్-ఏ మల్టీ డే జట్టు
దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), ఆమన్ మోకాడె, ఆయుశ్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), శామ్స్ ములాని, తనుశ్ కొటియన్, తుషార్ దేశ్‌పాండే, అన్సుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికెట్ భూటె, విజయ్‌కుమార్ వైశాక్.
భారత్-ఏ వన్ డే జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), ప్రియాన్షు ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్‌రాజ్ నిగమ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్య, ప్రభుసిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), గుర్జన్‌ప్రీత్ సింగ్, యశ్ ఠాకూర్.
భారత్-ఏ జట్టులో హార్దిక్ పాండ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



