Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మిడ్జిల్ మండలం రాణి పెట్ గ్రామానికి చెందిన బోయ మల్లేష్ గత కొద్ది రోజుల క్రితం కొత్తపల్లి గ్రామ శివారులో 167 జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో ఆ  కుటుంబానికి అండగా ఉండాలని మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల్ల లక్ష్మారెడ్డి రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ సర్పంచ్ నిరంజన్ తో కలిసి మృతుని భార్య రేణుకకు అందజేశారు. కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటి అధ్యక్షులు అమిర్, నాయకులు షబ్బీర్,జగన్ మగ్బుల్, కలిమ్ రహేమాన్,పాషా,నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -