- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ఇటీవల కాలంలో హోంగార్డు సురేష్ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. 2000-01 సంవత్సరం పదవ తరగతి తోటి స్నేహితులు సురేష్ కుటుంబాన్ని పరామర్శించి రూ.1 లక్ష 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే మరో మిత్రుడు విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ విజయ భాస్కర్ రెడ్డి సురేష్ పిల్లలకు పదవ తరగతి వరకు తన పాఠశాలలో ఉచితంగా చదివిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



