Monday, April 20, 2026
E-PAPER
Homeదర్వాజపీడకల

పీడకల

- Advertisement -

పీడకల హఠాత్తుగా నిజమైతే
ఎలా వుంటుందో
అలా వుంటుంది యుద్ధం
యుద్ధానికి పంపించిన కొడుకుని
మూటకట్టుకుని తెస్తారు
మూటను చూసి ముక్కలై పోయే
తల్లిని చూస్తాం
వీరతిలకం దిద్ది పంపిన భర్తను
రక్తపు ముద్దలా పార్శిల్‌ చేసి పంపిస్తారు
కన్నీటితో కలిసిన ఇల్లాలి నుదుటి బొట్టు
చెరిగిపోతున్న దృశ్యాన్ని చూస్తాం
చిట్టి చేతులతో టాటా చెప్పి పంపిన తండ్రి
చేతులు కోల్పోయి వస్తాడు
కొనూపిరితో వున్న
చిన్నారిని కౌగిలించుకోలేని తండ్రి
నిస్సహాయతలోంచి నిలువెత్తు కన్నీటిచుక్కై
పాప బుగ్గలమీంచి జారిపోతాడు
ఎవర్ని పంపినా యుద్ధానికి
ముక్కలయ్యేది మాత్రం
యుద్ధం కోరుకోని మనుషులే
ఎవరు గెలిచినా ఓడిపోయేది మాత్రం
సామాన్యుల బతుకులే
ఉలికిపాటుతో దిగ్గున లేచి అనుకున్నాను
ఈ యుద్ధం పీడకలయితే ఎంత బాగుండు
కలేలే అని సరిపెట్టుకునేవాళ్లం
– చిత్తలూరి, 9133832246

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -