Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త ఎమోషనల్‌ థ్రిల్లర్‌

సరికొత్త ఎమోషనల్‌ థ్రిల్లర్‌

- Advertisement -

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్‌ కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన చిత్రం ‘మిస్సింగ్‌ మేఘన’. వాచస్పతి దర్శకుడు.రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 18న సుమారు 150 థియేటర్స్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకూ రిలీజైన 3 పాటలకు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. డిజిటల్ మీడియాలో ఈ పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ధృవన్ అందించిన సంగీతం చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్ కే నాయుడు విజువల్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. టీజర్ అందరిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు. నిర్మాత నరేష్‌ బాబు మాట్లాడుతూ, ‘కంటెంట్ బాగా వచ్చింది. బిజినెస్ పరంగా హ్యాపీ. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా లాంచ్ చేశాం. ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ను నిర్మాత సురేష్ బాబు రిలీజ్‌ చేశారు. అలాగే 2వ పాటను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. 3 వ పాటను రైటర్, నిర్మాత కోన వెంకట్‌, మచ్చ రవి విడుదల చేయటం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇక తరువాత కూడా వస్తాయి. కానీ మా సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అని మాత్రం చెప్పగలను. క్లైమాక్స్ లో వచ్చే హుక్ పాయింట్ కి అందరూ షాక్ అవుతారు. ఇది నార్మల్ థ్రిల్లర్ కాదు. ఇదో ఎమోషనల్ థ్రిల్లర్. కచ్చితంగా అందర్నీ మా సినిమా అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -