- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామ సర్పంచ్ వీరోజు సుప్రియమురళీ శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కలిశారు. గ్రామాలలో సర్పంచులు ఎదుర్కుంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, మెట్టేపల్లి పురుషోత్తం రెడ్డి, మండిపల్లి వెంకట్, బదేపల్లి సిద్ధార్థతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
- Advertisement -



