Saturday, September 12, 2026
E-PAPER
Homeజాతీయంబ్రిక్స్ వేదికపై మోడి–పుతిన్–జిన్‌పింగ్.. వైరల్‌గా మారిన ఫోటో ..!

బ్రిక్స్ వేదికపై మోడి–పుతిన్–జిన్‌పింగ్.. వైరల్‌గా మారిన ఫోటో ..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: 18 వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా …. ప్రధాని నరేంద్ర మోడి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోడి మధ్యలో ఉండగా.. ఇరువైపులా పుతిన్, జిన్‌పింగ్ ఆయన చేతులు పట్టుకుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో …. ముగ్గురు కీలక నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మారుతున్న ప్రపంచ శక్తి సమీకరణాలకు ఈ దృశ్యం సంకేతంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడి మాట్లాడుతూ.. ప్రపంచ నిర్ణయాల్లో గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఉగ్రవాదం, ఏకపక్ష యుద్ధాలను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలు ‘ఢిల్లీ డిక్లరేషన్’కు మద్దతు తెలిపాయి. ఇరాన్, ఉక్రెయిన్ సమస్యలకు దౌత్యం, చర్చలే పరిష్కారమని భారత్ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -