గ్రామస్తులకు టెండర్ పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని బ్రహ్మేశ్వర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సోమేశ్వర్ తండాలో జగదంబ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి మంజూరైన రూ.22 లక్షల టెండర్ పత్రాన్ని శనివారం ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహించి, నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఈ మేరకు గ్రామాల్లో దేవాలయల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గ్రామానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తండా నాయక్ ఆడే నాజం, ఆలయ అధ్యక్షుడు రాథోడ్ సురేష్, ఏ ఎం సి డైరెక్టర్ అరుణ్, జాదవ్ తుకారాం, నరేందర్,దన్ను, శ్యామ్,రోహిదాస్ జైరాం, తండా వాసులు తదితరులు ఉన్నారు.
జగదాంబ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



