- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలానికి సబ్‌కలెక్టర్ సలోని ఛాబ్రా శనివారం స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా ఉప్పునుంతలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్, స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాలపై బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విధుల నిర్వహణలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు.
- Advertisement -



