బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు అజ్మీరా శంకర్ నాయక్
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెండు బోర్లు మంత్రి మంజూరు చేశారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బిఆర్ఎస్ గ్రామశాఖ అజ్మీరా శంకర్ నాయక్ శనివారం ఓక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ గ్రామంలో ఒక్క బోర్ వేయించకపోగా బోర్లు మంజూరు చేయించామని చెప్పుకోవడం సరికాదన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి అజ్మీరా సారక్క,బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్,బిఆర్ఎస్ నాయకులు బీసీ కాలనీ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారని,హామీ ప్రకారం సర్పంచ్‌ను గెలిపిస్తే బోర్ వేయిస్తామని,ఇచ్చిన మాట ప్రకారం బీసీ కాలనీలో బోర్ వేయించడం జరిగిందన్నారు.గ్రామ పంచాయతీ అవసరాల కోసం జీపీ కార్యాలయం వద్ద మరో బోర్ అవసరమని జిల్లా కలెక్టర్,సంబంధిత ఉన్నతాధికారులకు విన్నవిస్తే డిఎంఏప్టి/సిఎస్ఆర్ నిధుల ద్వారా రెండు బోర్లు మంజూరు చేయాలని కోరగా సంబంధించిన ఏఈ ఫీల్డ్ పరిశీలన నిర్వహించి రెండు బోర్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలన్నారు.



