పాకిస్తాన్ దూరం
గోవా: శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. మే 24నుంచి జూన్ 7వరకు గోవా వేదికగా జరిగే శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భారత్‌తోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్, మాల్దీవులు కూడా బరిలో దిగనున్నాయి. ‘గోవాలో శాఫ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్న క్రమంలో ఆలిండియా ఫుటల్‌బాల్ ఫెడరేషన్ దక్షిణ ఆసియా ఫుటబాల్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం కట్టెల్ బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఫటోర్డాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆరుజట్ల మధ్య టైటిల్ సంగ్రామం జరగనుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు దశాబ్దకాలం తర్వాత మరోసారి ఆతిథ్య హక్కులు దక్కాయి. భారత్ శాఫ్ టోర్నీ జరగనున్న క్రమంలో పాకిస్తాన్ మహిళలజట్టు టోర్నీనుంచి వైదొలిగింది. రెండు గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడతాయి. సెమీస్‌లో గెలిచిన రెండుజట్ల మధ్య టైటిల్ సంగ్రామం జరగనుంది. గత రెండు ఎడిషన్‌లలో భారతజట్టు అద్భుత ప్రతిభను కనబర్చింది. 2022, 2024లలో బంగ్లాదేశ్, నేపాల్ జట్ల చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2019 ఫైనల్లో ఆతిథ్య నేపాల్‌పై భారత మహిళలజట్టు 3-1 గోల్స్ తేడాతో ఓడించి చివరిసారిగా టైటిల్‌ను కైవసం చేసుకుంది.
గ్రూప్‌లు…
గ్రూప్-ఎ : నేపాల్, శ్రీలంక, భూటాన్
గ్రూప్-బి : ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు
శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం
- Advertisement -
- Advertisement -



