Thursday, April 23, 2026
E-PAPER
Homeఆటలుఐసిసి పదవికి వాసిం ఖాన్‌ గుడ్‌ బై

ఐసిసి పదవికి వాసిం ఖాన్‌ గుడ్‌ బై

- Advertisement -

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ సిఇఒ వాసిమ్‌ ఖాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీలో జనరల్‌ మేనేజర్‌ పదవికి గుడ్‌ బై చెప్పాడు. నాలుగేళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్న వాసిం ఖాన్‌ జెఫ్‌ అల్లార్డెస్‌ నుంచి 2022లో బాధ్యతలను స్వీకరించారు. దీనికి ముందు వాసిం ఖాన్‌ పిసిబి సిఇఒగా మూడేళ్లు పనిచేశాడు. తాజాగా ఐసిసి జనరల్‌ మేనేజర్‌ పదవిని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినా.. ఐసిసి మరో బాధ్యతలను అందుకునే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ఐసిసిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అమిత్‌ షా కుమారుడు జై షా ఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వదిలేశారు. అల్లార్డెస్‌తోపాటు యాంటీ కరప్షన్‌ యూనిట్‌కు చెందిన క్రిస్‌ టెట్లీ, అలెక్స్‌ మార్షల్‌ వైదొలిగారు. వారి స్థానంలో గౌరవ్‌ సక్సేనా, ఆండ్రూ వచ్చి చేరారు. ఇప్పుడు వాసిమ్‌ఖాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. పాక్‌ క్రికెట్‌ బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టిన వాసిమ్‌ ఇంగ్లాండ్‌లో జన్మించడం విశేషం. అక్కడే తన క్రికెట్‌ కెరీర్‌ను మొదలుపెట్టారు. పాక్‌ మూలాలు ఉన్నప్పటికీ.. ఈ జట్టు తరఫున ఒక్క మ్యాచూ ఆడలేదు. కానీ, పీసీబీకి సీఈవోగా పనిచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -