- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యశ్వంత్, తాను నివసిస్తున్న కో-లివింగ్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన యశ్వంత్, గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితమే మాదాపూర్‌లోని హాస్టల్‌లో చేరినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



