Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరచింతలో హమారా ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నిరసన

అమరచింతలో హమారా ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నిరసన

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూర్ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ను అవమానిస్తూ “కల్పిత నాయకుడు అంబేద్కర్” అనే పుస్తకాన్ని రాసిన హమారా ప్రసాద్ పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ గురువారం అమరచింతలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరచింతలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అనంతరం అమరచింత పోలీస్ స్టేషన్ లో ఎస్సై స్వాతి కి ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఈ శ్యామ్ సుందర్, అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షులు కే విజయ్, ఎమ్మార్పీఎస్ అమరచింత మండల అధ్యక్షులు ఎ. ప్రసాద్ కుమార్ మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షులు, తొమ్మిదవ వార్డ్  కౌన్సిలర్ వేద విష్ణు దళిత సంఘం జిల్లా నాయకులు ఎస్ ప్రభుదాసు కో ఆప్షన్ సభ్యులు ఎస్ అజయ్, తౌఫిక్,  షాజహాన్ బేగం, మాట్లాడుతూ.. కల్పిత నాయకుడు అంబేద్కర్ అనే పుస్తకాన్ని ఈ నెల 18న హైదరాబాద్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాతను కించపరిచేలా పుస్తకం రాయడమే కాకుండా, గతంలో కూడా “నేను గాడ్సే అయితే గాంధీని చంపినట్లే అంబేద్కర్ ను చంపేవాడిని” అంటూ తీవ్ర పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఇటువంటి క్రూర మనస్తత్వం కలిగిన హమారా ప్రసాద్ పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, ఆ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కే వీ పీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యస్.ఈ. శ్యామ్ సుందర్, అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షులు కె. విజయ్, ఎం ఆర్ పి ఎస్ అమరచింత మండల అధ్యక్షులు ఎ. ప్రశాంత్ కుమార్, మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షులు, 9వ వార్డు కౌన్సిలర్ వేద విష్ణు, దళిత సంఘం జిల్లా నాయకులు యస్. ప్రభుదాసు, 4వ వార్డు కౌన్సిలర్ వనిత ప్రకాశం, 7వ వార్డు కౌన్సిలర్ డి.సి. మాధవి రాజేందర్, కో-ఆప్షన్ సభ్యులు యస్. అజయ్, తౌఫిక్, షాజహాన్ బేగం, కెవిపిఎస్ మండల కార్యదర్శి ఎస్సీ అరుణ్ కుమార్, యస్. విజయ్, ఏ. హరీష్, ఏ. రవి కుమార్, ప్రత్యూష్, భరత్, అశోక్ కుమార్, శరత్, నెపోల్ జాన్, బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -