Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమరోసారి భారత్,చైనాలపై యూఎస్ ఆంక్షల బెదిరింపులు

మరోసారి భారత్,చైనాలపై యూఎస్ ఆంక్షల బెదిరింపులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్, చైనాలపై ఆంక్షల బెదిరింపులకు దిగింది. రష్యా చమురు, గ్యాస్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, లేకపోతే అమెరికా నుండి మునుపెన్నడూ లేని ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధులు సందేశం పంపించారు.. అమెరికా కాంగ్రెస్‌లో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందిన అనంతరం రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ మీడియాతో మాట్లాడుతూ.. న్యూఢిల్లీ – బీజింగ్‌లను ‘తమ పద్ధతిని మార్చుకుని’, తమ ఇంధనాన్ని ‘మరెక్కడి నుంచైనా’ కొనుగోలు చేయాలని హెచ్చరించారు. “చైనా, భారత్‌లకు మీ పద్ధతిని సరిదిద్దుకోవడం మంచిది. మీ చమురు, గ్యాస్‌ను మరెక్కడైనా కొనండి. బుజ్జగింపు ఒక వ్యూహం కాదు,” అని ఆయన అన్నారు.

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి గుండా చమురు నౌకల రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రపపంచ దేశాలు ఇంధన సంక్షోభంలో కూరుకుపోయ్యాయి. ఒక్కసారిగా ఇంధన లోటుతో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. యుద్ధం కన్నా ముందు రష్యా ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్ కు యూఎస్ వార్నింగ్ వచ్చింది. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో సడలింపు లిచ్చింది. ఇటీవల ఢిల్లీ వేదిగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఏకప్రక్ష యుద్ధానికి, వాణిజ్యం ఆంక్షలను వ్యతిరేకిస్తూ కూటమి సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిక్స్ కూటమి ఐక్యతను జీర్ణించుకోలేక ట్రంప్ కుట్రలకు తెరలేపారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -