Thursday, September 17, 2026
E-PAPER
Homeజిల్లాలుసంగారెడ్డి మెడికల్ కళాశాలలను దేశంలోనే నెం.1గా నిలుపుతాం: మంత్రి దామోదర

సంగారెడ్డి మెడికల్ కళాశాలలను దేశంలోనే నెం.1గా నిలుపుతాం: మంత్రి దామోదర

- Advertisement -

మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ-సంగారెడ్డి 

రాబోయే రెండేళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో హెటిరో ఫౌండేషన్ సౌజన్యంతో రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్, క్రికెట్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ క్రికెట్ గ్రౌండ్‌ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు.

అనంతరం వైద్య విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందనీ, సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణను వైద్య రంగంలో దేశంలోనే ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రభుత్వాలు, నాయకత్వాలు శాశ్వతం కావని, ప్రజలకు నిరంతరం సేవలందించేలా వ్యవస్థలను బలోపేతం చేయడమే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా  యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్, సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను మంత్రి పంపిణీ చేశారు. సి.ఎస్.ఆర్  నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 700 మంది రోగులకు నెలకు ఒక కిట్ చొప్పున వరుసగా 6 నెలల పాటు ఉచితంగా పోషకాహార కిట్లను పంపిణీ  చేసినట్లు తెలిపారు. క్షయ వ్యాధి  నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థల సహకారం అవసరమని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాశరావు, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, హేటిరో ఫౌండేషన్ ప్రతినిధి సుధాకర్, మెడికల్ కళాశాల విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -