- Advertisement -
అనారోగ్యానికి గురైన ‘నక్కల’కు పరామర్శ
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ-కొమురవెల్లి
సీపీఐ(ఎం) ఎదుగుదల కోసం పార్టీ సీనియర్ నాయకులు నక్కల యాదవరెడ్డి తన జీవితాంతం కృషి చేశారని కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మర్రిముస్త్యాలకు చెందిన యాదవరెడ్డిని ఆయన గురువారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చ టించారు. అనంతరం యాదవరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -



