Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం22 ఏ పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ

22 ఏ పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ

- Advertisement -

118 జీవో ప్ర‌కారం 19నుంచి రెగ్యుల‌రైజేష‌న్‌ : అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా 22ఏ కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో జీరో అవర్‌ ‌ముగిసిన తర్వాత స్పీకర్‌ అనుమతితో స్టేట్‌‌మెంట్‌ ఇచ్చారు. ఉన్నతస్థాయి కమిటీకి చైర్మెన్‌‌గా సీసీఎల్‌ఎ డీ.ఎస్‌. లోకేష్ కుమార్ వ్యవహరిస్తారని, న్యాయశాఖ కార్యదర్శి పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్‌‌స్పెక్టర్‌ ‌జనరల్‌ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటార‌ని ‌మంత్రి తెలిపారు. ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల్లో 118 జీవో ప్రకారం 9,700 ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశామనీ, నేటి నుంచే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల స్థలాల రెగ్యుల‌రైజేష‌న్‌కు సంబంధించి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో జారీ చేసిన జీవో 76 అనుస‌రించి రెగ్యుల‌రైజేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అలాగే రెవెన్యూ రికార్డుల్లో 22ఏలో ఉండి హెచ్ఎండీఏ , డీటీసీపీ, జీహెచ్ఎంసీ అనుమ‌తుల‌తో లే అవుట్లు వేసిన ప్రాంతాలను 22ఏ నుంచి తొల‌గించే విష‌యంలో త్వరలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించిన 12 అంశాల‌పై నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే నిర్ణ‌యం తీసుకొని ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తామ‌ని పొంగులేటి ప్ర‌క‌టించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -