Saturday, September 19, 2026
E-PAPER
Homeక్రైమ్స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి..

స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి..

- Advertisement -

అప్పుల బాధ తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
నవతెలంగాణ-ముషీరాబాద్‌
​హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ స్టీల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌ పార్సిగుట్టకు చెందిన మనోజ్‌కుమార్‌(29) శివం రోడ్డులోని అపోలో డయాగ్నొస్టిక్స్‌లో పని చేసేవాడు. కాగా, అప్పులు ఎక్కువవడంతో మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్డు స్టీల్‌ బ్రిడ్జి పైకి వచ్చాడు. కిందికి దూకడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్టీల్‌ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -