- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ మైనర్ బాలిక(17)పై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేసి గర్భవతిని చేయగా, బాలిక తల్లి సహకారంతో అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. బాలిక తల్లితో పరిచయం ఏర్పరచుకున్న నిందితుడు, ఆమె ఇంట్లోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాలిక తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక అక్క ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు, బాలిక తల్లి, సహకరించిన బంధువుపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



