- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం వేకువజామున కునార్, పక్తిక ప్రాంతాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. ఇళ్లు, షాపులు ధ్వంసమయ్యాయి. సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ పౌరుల నివాసాలపై దాడి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
- Advertisement -



