Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రతి నియోజకవర్గంలో లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తాం: మంత్రి పొంగులేటి

ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తాం: మంత్రి పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ–హైదరాబాద్‌: క్యూఆర్‌ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు అందే వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విడతల వారీగా కొనసాగుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని 2.85 ఎకరాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేశారు. వచ్చే నెల రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -