Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాలమూరులో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ దుర్మార్గం

పాలమూరులో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ దుర్మార్గం

- Advertisement -
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్: జూరాల యకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని రైతుల పక్షాన డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి , న్యాయమైన డిమాండ్ తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -