Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరెంటు ఆఫీస్ కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు

కరెంటు ఆఫీస్ కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలోని 167 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కరెంట్ ఆఫీసును కబ్జార్ చేయాలని కొందరు భూ కబ్జాదారులు ప్రయత్నం చేస్తున్నారని, అట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరం నిర్వహిస్తున్న ప్రజావాణిలో మండలానికి చెందిన పెరుమళ్ళ జంగయ్య, మల్లె తిరుపతి, మసిగుండ్లపల్లి దేవాలయ చైర్మన్ వెంకటయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో ఆనాటి స్థానిక సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి హాయంలో జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సర్వేనెంబర్ 16 లో 3=09 గుంటలు పొలం ఎకరాకు 3500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

భూమి అమ్మినవారే కబ్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులే కాపాడాలని కోరారు. 10 సంవత్సరాల క్రితం లోకాయుక్తలో  కేసు వేయడం ద్వారా ప్రభుత్వ భూమి తీర్పుగా వచ్చిందని తెలిపారు. మండల నాయకులు, శాఖకు సంబంధించిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి ప్రజల పక్షాన ప్రజల ఆస్తిని కాపాడగలరని కోరుతున్నాము. లేని యెడల రాబోయే రోజులలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమి కోసం  రిలే నిరాహార దీక్షలు రాస్తారోకలు చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -