నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని కాకరపల్లి రోడ్‌లోని రావి చెట్టు బజారు, రాజీవ్ నగర్, కల్పతరు రోడ్, జలగం నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక గణనాథుల మండపాలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సోమవారం దర్శించారు. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వ స్వీకరించారు.
భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను డాక్టర్ దయానంద్ విజయకుమార్ ప్రారంభించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్ పాషా, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, బొంతు వేణు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.



