నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన మద్దెల జార్జీ కుమారుడు మద్దెల కార్తీక్, సీతారాంపురం గ్రామంలో ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల మల్లయ్య తండ్రి అయిన వేల్పుల భయాలు ల మృతి చెందడంతో ఆ కుటుంబాలను బూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సోమావారం పరామర్శించారు. ఇందులో భాగంగా ఆ గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్, ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డిలతో కలిసి చిత్రపటానికి కులమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు.
మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేమని చెప్పారు. వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్, ఆ గ్రామ సర్పంచ్ బాదావత్ భాస్కర్, మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవరెడ్డి, మాజీ అధ్యక్షులు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్, ఉపసర్పంచ్ రామగిరి సుమన్ గ్రామ అధ్యక్షులు బెల్లి నర్సయ్య డోనికాని మల్లయ్య,కుటుంబ సభ్యులు కార్తీక్ భార్య సుచరిత,మద్దెల భద్రయ్య, మద్దెల డా,,ప్రభాకర్,మద్దెల పవన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మండలంలోని ఆలేరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో నల్ల మాస శ్రీనివాస్, గుదే యుగంధర్, కాలేరు మల్లేష్ ,శీను, ఇట్టే దేవేందర్ రెడ్డి తోపాటు జిల్లా మండల గ్రామస్తులు పాల్గొన్నారు.



