Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభయహస్తం డబ్బులు తిరిగి ఇవ్వాలి

అభయహస్తం డబ్బులు తిరిగి ఇవ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు 
నవతెలంగాణ-నెల్లికుదురు

అభయహస్తం పేరుతో మహిళలు కట్టిన డబ్బులను ప్రభుత్వం తిరిగి వారికి ఇచ్చి శ్రీనిధి లోనులను తక్షణమే మాఫీ చేయాలని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు మండల కేంద్రంలో సిఐటియు నాయకుడు బొల్లం ఎల్లయ్య తో కలిసి ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం డ్వాక్రా గ్రూప్ సంఘాల ద్వారా ప్రభుత్వం సంఘ సభ్యుల తో రూ.3800 ప్రతి గ్రూప్ సభ్యు రాలి తో స్థానిక వివో ఏల ద్వారా ప్రభుత్వం పేద డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ సౌకర్యం 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మహిళల దగ్గర డబ్బులు వసూలు చేసింది అని అన్నాడు.

ఇప్పటివరకు ఆ డబ్బులు చెల్లించలేదు కొంతమంది డ్వాక్రా మహిళలు చనిపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం ఇస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు ప్రభుత్వం వసూలు చేసిందని తెలిపాడు. ఇప్పటివరకు తక్షణమే వసూలు చేసిన 3 800 రూపాయలు ప్రభుత్వం వారికి వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. అత్యవసరాల నిమిత్తం శ్రీనిధి అనే పేరుతో పేద ప్రజలకు రుణాలు ఇచ్చి ఉన్నారు, అట్టి రుణాలు చెల్లించాలని మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చెందారు. కూలి పనుల మీద ఆధారపడి కుటుంబాలను వెలదీస్తున్న పేద మహిళలు కట్టలేకపోతున్నారు అని తెలిపారు. ఈ సంవత్సరం కరువు కాలంగా ఉండడంతో ప్రజలకు వ్యవసాయ రంగ పనులు దొరకడం లేదని వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అందుకని కట్టలేక పోతున్నారు అనే చెప్పారు.

అదేవిధంగా ప్రభుత్వం చిన్నచిన్న  రైతులకు రుణాలు ఇస్తుంది అనేక రకాల కారణాల పేరుతో రుణమాఫీ చేస్తుంది .భూమి లేని నిరుపేదలకు కూడా సర్వే నిర్వహించి వారు నిజంగా భూమి లేని నిరుపేదలే అయితే కట్టలేని పరిస్థితిలో ఉంటే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నాడు.ప్రభుత్వం ఇప్పటికైనా పేద మహిళలు చెల్లించిన రూ.3800 తక్షణమే చెల్లించాలని శ్రీనిధిలో తీసుకున్న పేదలను గుర్తించి వాటిని మాఫీ చేయాలని లేనియెడల లబ్ధిదారుల సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బొల్లం ఎల్లయ్య తో పాటు కొంతమంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -