Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంసోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు షాక్

సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు షాక్

- Advertisement -

పౌరసత్వం కేసులో దర్యాప్తునకు ఆదేశాలు
పౌరసత్వం పొందడానికి మూడేండ్ల ముందే ఎన్నికల జాబితాలో సోనియా 
పేరు ఉందని ఆరోపణలు
గతంలో దీనిపై దర్యాప్తును తిరస్కరించిన
మేజిస్ట్రియల్‌ కోర్టు
తాజాగా దాన్ని కొట్టివేస్తూ ఆదేశాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. 1983లో భారత పౌరసత్వం పొందేందుకు మూడేండ్ల ముందే సోనియా గాంధీ పేరును ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణపై విచారణకు నిరాకరిస్తూ గతంలో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన రివిజన్ పిటిషన్‌ను అనుమతించింది. ఈ పిటిషన్ను తిరిగి విచారణ చేపట్టాలంటూ ఢిల్లీ కోర్టు సోమ వారం ఆదేశించింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వును సరైన వివరణ లేనిదిగా పేర్కొంటూ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే దానిని కొట్టివే శారు. రౌస్ అవెన్యూ కోర్టుల సెంట్రల్ ఢిల్లీ కోర్ట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అడ్వకేట్ వికాస్ త్రిపాఠి ఈ పిటిషన్ను దాఖలు చేశారు.

“భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 175(3)ను పాటిం చకపోవడం, ముఖ్యంగా సంబంధిత పోలీస్ అధికారి వాదనలు వినకపోవడం, సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి స్టేటస్ రిపోర్ట్ తెప్పిం చకపోవడం వంటి కారణాల వల్ల సదరు ఉత్తర్వు లో చట్టపరంగా స్పష్టమైన లోపం ఉంది. చట్టం ప్రకారం ఉన్న రెండు మార్గాలను అంటే ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించడం లేదా ప్రత్యా మ్నాయంగా బీఎన్‌ఎస్‌ఎస్ కింద విచారణ జరపడం వంటి అంశాలను మేజిస్ట్రేట్ పరిగణ నలోకి తీసుకోనందున ఆ ఉత్తర్వులో ఎటువంటి వివరణా లేదని స్పష్టమవుతోంది.” అని న్యాయమూర్తి అన్నారు.
‘ఆ చట్టపరమైన ప్రత్యామ్నాయాలను మెజిస్ట్రేట్ పరిశీలించలేదు’ ఫిర్యాదులో గుర్తిం చదగిన నేరం జరిగినట్లు వెల్లడైందా లేదా అనే ప్రధాన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే మేజిస్ట్రేట్ పౌరసత్వం అనే అంశం వైపు మళ్లారని న్యాయమూర్తి అభిప్రా యపడ్డారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించడం లేదా బీఎన్ఎస్ఎస్ కింద ప్రొసీడింగ్స్ నిర్వహిం చడం అనే చట్టప రమైన ప్రత్యామ్నా యాలను మెజిస్ట్రేట్ పరిశీలిం చలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజా వాదన లు విన్న న్యాయ స్థానం కార ణాలతో కూడిన ఉత్తర్వు జారీ చేయాలని మేజి స్ట్రేట్‌కు తిరిగి పంపింది. ఈ కేసు తదుపరి విచా రణ కోసం సెప్టెంబర్ 29కి వాయిదా వేశారు. ఈ తీర్పును ఢిల్లీ కోర్టు తాజాగా పక్కనబెట్టడంతో దర్యాప్తునకు మార్గం సుగమం అయ్యింది.

కేసు ఏంటంటే?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 1983లో భారత పౌరసత్వం పొందడానికి మూడేండ్ల ముందే 1980లో ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఆ వ్యవహరంలో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. 1983లో సోనియాకు భారత పౌరసత్వం వచ్చింది. 1980 నాటి ఓటర్ జాబితా అంటూ గతంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. గాంధీ కుటుంబ సభ్యులైన ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీతో పాటు సోనియా పేరును చేర్చారని అందులో పేర్కొన్నారు. అప్పటికీ ఆమె ఇంకా ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నారని చెప్పారు. అయితే దానిపై విమర్శలు రావడంతో 1982లో ఓటర్ జాబితా నుంచి ఆమె పేరు తొలగించారని, 1983లో మళ్లీ కనిపిం చిందని రాసుకొచ్చారు. అప్పుడు కూడా పౌరసత్వం రావడానికన్నా ముందే మళ్లీ జాబితాలోకి పేరు వచ్చి చేరిందని ఆరోపిం చారు. రాజీవ్‌ను వివాహమాడిన తర్వాత పౌరసత్వం రావడానికి 15 ఏళ్లు ఎందుకు పట్టిందని ఇక్కడ ప్రశ్నించడం లేదు. ముందే ఓటర్ జాబితాలో ఆమె పేరు కనిపించడం ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో నే దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -