Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంఫ్రీ ట్రేడ్: దౌత్య పత్రాలను మార్చుకున్న భారత్‌, న్యూజిలాండ్‌

ఫ్రీ ట్రేడ్: దౌత్య పత్రాలను మార్చుకున్న భారత్‌, న్యూజిలాండ్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టిఎ) అధికారికంగా ఆమోదించాయని న్యూజిలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్‌ మెక్‌క్లే తెలిపారు. ఎఫ్‌టిఎ కోసం చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని ధృవీకరిస్తూ భారత్, న్యూజిలాండ్ దేశాలు సోమవారం లాంఛనంగా దౌత్య పత్రాలను మార్చుకున్నాయి. న్యూజిలాండ్ పార్లమెంటులో మెక్‌క్లే, న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ మువాన్‌పుయి సయావిలు అధికారిక పత్రాలను మార్పిడి చేసుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం ఒక “చారిత్రాత్మక” ముందడుగుగా మెక్‌క్లే అభివర్ణించారు.

ఈ ఒప్పందం 2026, అక్టోబర్‌ 20 నుండి అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటైన భారతదేశంలోకి న్యూజిలాండ్‌ వాణిజ్యానికి సమాన అవకాశాలు కల్పించి, ప్రవేశాన్ని సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతున్నందున, న్యూజిలాండ్ ఎగుమతిదారులు తమ వ్యాపారాలను విస్తరించడం,కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై ఇరు దేశాలు ఈ ఏడాది ఏప్రిల్ 27న సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత్ నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై న్యూజిలాండ్ సుంకాలను పూర్తిగా తొలగించనుంది. న్యూజిలాండ్ నుండి దిగుమతులలో 95శాతం వస్తువులపై భారత్ సుంకాలను తొలగించవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ఎఫ్‌టిఎను అమలు చేసే చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -