Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపట్టినపాక్కంలో కొత్త సచివాలయం.. స్టాలిన్‌ ఆగ్రహం

పట్టినపాక్కంలో కొత్త సచివాలయం.. స్టాలిన్‌ ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పట్టినపాక్కంలోని శీనివాసపురం వద్ద కొత్త సచివాలయం నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మత్స్యకార సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. సచివాలయం నిర్మాణంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, కొత్త సచివాలయం నిర్మించనున్నట్లు ప్రభుత్వ జీవో విడుదల కావడంతో ముళ్లికుప్పం శీనివాసపురం, ముళ్లిమానగర్, రాజీవ్‌గాంధీ నగర్, నంబిక్కై నగర్, భవాని కుప్పం, డుమ్మింగ్‌ కుప్పం, ఇరుదయరాజపురం, సెల్వరాజ్‌పురం, నొచ్చినగర్, నొచ్చికుప్పం తదితర మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు  చేపట్టారు. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తే తమ జీవనాధారం దెబ్బతింటుందని, తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -