- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ (36) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. వరుస గాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఫ్రాంచైజీ లీగుల్లో మాత్రం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 146 మ్యాచ్లలో 253 వికెట్లు తీసిన మార్క్ వుడ్, 38 టెస్టుల్లో 119 వికెట్లు సాధించారు. 2015 యాషెస్, 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్లలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
- Advertisement -



