Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజూరాలకు సాగునీరు విడుదల చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో

జూరాలకు సాగునీరు విడుదల చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూరాల ప్రాజెక్టు నుంచి వానాకాలం వరి, ఇతర పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో జూరాల’ కార్యక్రమం నిర్వహించారు. నందిమల్ల గ్రామం నుంచి జూరాల డ్యాం వరకు పాదయాత్ర చేపట్టి, అనంతరం డ్యాం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి. బాల్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీఎస్‌ గోపి, ఎం. రాజు, జిల్లా నాయకులు ఆర్‌ఎన్‌ రమేష్‌, ఎస్‌. రాజ్‌, అజయ్‌, కురుమూర్తి, రాఘవ మాట్లాడుతూ.. ‘చలో జూరాల’ కార్యక్రమానికి వస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములను బూత్‌పూర్‌ వద్ద అరెస్టు చేయడాన్ని ఖండించారు.

జిల్లావ్యాప్తంగా సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు నుంచి వరి సాగుకు నీటిని విడుదల చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం డ్యాం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ(ఎం), రైతు సంఘం నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి ఆత్మకూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను ఖండించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -