నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లోని పైకప్పు పెచ్చులు ఊడిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను పెను ప్రమాదం తప్పింది. అయితే ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆస్పత్రి గేటు ముందు పోలీసులను భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు వినయ్ భాస్కర్ కడుపులో తన్నారు. ఈ దాడిలో తన చేయి విరిగిందంటూ వినయ్ భాస్కర్ కంటతడి పెట్టుకున్నారు.
ఎంజీఎం ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



