Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగర్‌ ఎడమ కాలువకు 
నీటి విడుదల

సాగర్‌ ఎడమ కాలువకు 
నీటి విడుదల

- Advertisement -

తాగు నీటి కోసం 3000 క్యూసెక్కులు
​నవతెలంగాణ-నాగార్జునసాగర్

​నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు బుధవారం డ్యామ్ అధికారులు నీరు విడుదల చేశారు. వినాయక నల్లగొండ జిల్లా ఎడమ కాలువ పరిధిలో భారీగా గణేష్‌ నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 3000 క్యూసెక్కుల మేరకు నీటి విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరో రెండు మూడ్రోజులపాటు ఈ నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు. కాగా, గత నెల 26న ఎడమ కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేసిన డ్యామ్‌ అధికారులు ఈనెల 22వ తేదీ రాత్రి నిలిపివేశారు. సుమారుగా 14 టీఎంసీల నీటిని ఎడమ కాలువ పరిధిలో నలగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు విడుదల చేశారు. వినాయక విగ్రహ నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ నీరు విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -