Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి..

ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి..

- Advertisement -

– మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య 
పాఠశాల కరపత్రాల ఆవిష్కరణ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండలంలోని ఆయా గ్రామాలలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య కోరారు. శుక్రవారం మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్ అధ్యక్షతన జరిగిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరపత్రాలను గ్రామ ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి బడిబాట ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ పథకాలను పొందడంలో చూపే ఆసక్తి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై కూడా ఆసక్తి చూపాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పిల్లలను ఉన్నత విద్యవంతులుగా తీర్చిదిద్దే అవకాశం తమకు కల్పించాలన్నారు.కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు కిషన్ గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్,  ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, సంతోష్, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad