Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుటీజీపీఎస్సీ గ్రూప్‌-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన..షెడ్యూల్‌

టీజీపీఎస్సీ గ్రూప్‌-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన..షెడ్యూల్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రూప్‌-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. జూన్‌ 18 నుంచి జులై 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు; అలాగే.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో సురవరం ప్రతాప్‌ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్సిటీ)లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగనుంది. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో పాటు వెరిఫికేషన్‌ కొరకు ఏయే సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాలో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. 
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్‌ -3 అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్‌ స్వయంగా సంతకం చేసిన(సెల్ఫ్‌ అటెస్టెడ్‌) ఫొటో కాపీలు తీసుకురావాలని సూచించింది. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img